మత్స్యగిరి ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ

కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో ఉన్న మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం(Matsyagiri Temple) ఎంతో మహిమాన్వితమైనదని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam) అన్నారు. బుధవారం మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాసు, డైరెక్టర్‌లు  ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నూతన పాలకమండలి దేవస్థానం అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యేకు దేవస్థానం అధికారులు పూర్ణకుంభంతో, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఈవో కొత్తపల్లి వెంకటయ్య ఎమ్మెల్యేకు జ్ఞాపికతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>