ఇథనాల్ వివాదం.. నితిన్ గడ్కరీ కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. దేశ వ్యాప్తంగా అమలువుతున్న ఈ20 ఇథనాల్ బ్లెండింగ్ విధానంతో తాను భారీగా లబ్ధిగా పొందుతున్న సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని పిటిషన్ వేశారు. తాను, తన కుటుంబసభ్యులు కంపెనీలు స్థాపించి లాభపడుతున్నట్లు డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు.

నాకు సంబంధం లేదు..

ఈ20 ఇథనాల్ బ్లెండింగ్ విధానాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖనే అమలు చేస్తోందని.. దీనిలో తనకు ఎలాంటి సంబంధం ఉండదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. అయినా, తనను కొన్ని నెలలుగా టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నాని చెప్పారు. ఈ మేరకు మెటా సహా కొన్ని సోషల్ మీడియా హ్యాండిళ్లు, వాటిని నిర్వహిస్తున్న వ్యక్తులపై సివిల్ దావా దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. విచారణ జరిపిన కోర్ట్.. అందుకు అంగీకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>