రైతాంగ నీటి సమస్యలపై స్పందించాలి : కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

కలం, చండూరు : మునుగోడు రైతాంగ నీటి సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Kusukuntla Prabhakar Reddy) అన్నారు . ఆదివారం స్థానిక రాజశ్రీ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు, మునుగోడు ఎమ్మెల్యే పనితీరుపై రైతులకు న్యాయం జరగడం లేదని, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నియోజకవర్గం ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

దిండి నీటి పంపకాల్లో మునుగోడుకు రావాల్సిన నీటిని 440 అడుగుల వద్ద రెగ్యులేటర్ పెట్టి 436 అడుగుల వద్ద మోటర్లు బిగించి మహబూబ్ నగర్ కు తీసుకుపోతున్నారని ఆయన ఆరోపించారు. బహిరంగంగా మునుగోడు నియోజకవర్గం ఎడారి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను చూస్తూ కూర్చోవడం తప్ప రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు.

దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో నీటి పంపకాల్లో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. మునుగోడు రైతుల అవసరాలకు కేటాయించిన నీటి వాటాను సరిగా అమలు చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మౌనం వహిస్తున్నారని, దీనివల్ల మునుగోడు భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించాలన్న లక్ష్యం ఉన్నప్పటికీ అమలు నెమ్మదిగా సాగుతోందని ఆయన ఆరోపించారు.

ఏదుల నుంచి దిండి ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వద్దని సీఎం రేవంత్ రెడ్డికి మహబూబ్ నగర్ కు ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారని, కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దీనిని అడ్డుకోవాల్సింది పోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్​ కుమార్ రెడ్డిని కలిసి మాట్లాడాలని ఉత్త మాటలు చెబుతున్న రాజగోపాల్ రెడ్డి ఇకనైనా మాటలు కట్టిపెట్టి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి దిండి ప్రాజెక్టు నుండి నీళ్లు తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలన్నారు.

మునుగోడు అభివృద్ధికి నిధులు తేవాల్సింది పోయి ఎక్కడో నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాలకు వెళ్లి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను ఈ నియోజకవర్గాలలో పట్టించుకోవడం లేదన్నారు. స్వలాభం కోసం ఏదో కావాలని.. ఉనికి కోసం సోషల్ మీడియాలో వార్తలు నిలవాలని ఆర్భాటం ప్రచారం తప్ప మునుగోడు నియోజకవర్గానికి రాజగోపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమాత్రం లేదన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సతీష్, రాష్ట్ర నాయకుడు ఎత్తపు మధుసూదన్ రావు, మండల ఆధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, యువజన అధ్యక్షుడు ఉజ్జిని అనిల్ రావు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పెద్దగోని వెంకన్న గౌడ్, నాయకులు తేలుకుంట్ల చంద్రశేఖర్, సామ యాదవ రెడ్డి, నారపాక శంకర్, అన్నేపాక ధనయ్య, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>