కలం, వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దుప్పల్లి నారాయణ (Duppalli Narayana) డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వనపర్తి జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం యువమోర్చా జిల్లా అధ్యక్షుడు అరవింద్ ఆధ్వర్యంలో ‘ఫీజు బకాయి – బీజేపీ లడాయి’ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దుప్పల్లి నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వనపర్తి నియోజకవర్గంలోని వివిధ కళాశాలల విద్యార్థులతో కలిసి చేపట్టనున్న ‘ఫీజు బకాయి – బీజేపీ లడాయి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు బాసెటి శ్రీనివాసులు, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అలివేలమ్మ, యువ మోర్చా నాయకులు చింతకాయల శివ, కాట్రావత్ వెంకటేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

