కలం, నిర్మల్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో నిర్మల్ (Nirmal) జిల్లా లక్ష్మణ చందా మండలం కనకాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడి శ్రీహరిరావు మాట్లాడుతూ.. నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల న్యాయమైన పోరాటానికి, కాంగ్రెస్ పార్టీ చేసిన నిరంతర డిమాండ్‌కు లభించిన విజయమని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుత పాలన కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

