కాక్రోచ్‌ల నిరసన ఎఫెక్ట్.. బిట్ చాట్ యాప్ పై కేంద్రం కొరడా

కలం, వెబ్ డెస్క్ : ఇటీవల రాజధాని ఢిల్లీలో జరిగిన ‘సంసద్ చలో’ మార్చ్ నిరసనల సందర్భంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినప్పటికీ, క్రాకోచ్ జనతా పార్టీ నిరసనకారులు సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి బిట్ చాట్ యాప్‌(Bitchat App) ను ఉపయోగించినట్లు ఢిల్లీ పోలీసు దర్యాప్తులో తేలింది. దీంతో ఇంటర్నెట్ సేవల అవసరం లేకుండా కేవలం బ్లూటూత్ నెట్‌వర్క్ ఆధారంగా పనిచేసే ‘బిట్‌చాట్’ అప్లికేషన్‌పై కేంద్ర హోంశాఖ తీవ్ర నిఘా ఉంచింది. ఈ క్రమంలోనే బిట్ చాట్ ను బ్లాక్​ చేయాలని గిట్ హబ్ సీఈవోకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ మేరకు తనకు అందిన నోటీసును గిట్​ హబ్ సీఈవో జాక్ డోర్సీ సోషల్ మీడియాలో వెల్లడించారు. భారత ప్రభుత్వానికి బిట్‌చాట్ లాంటి టెక్నాలజీలు నచ్చవు, అందుకే దానిని తొలగించాలని కోరుకుంటుందని ఎద్దేవా చేశారు. అయితే సాధారణ కమ్యూనికేషన్ వ్యవస్థలకు దూరంగా పనిచేసే ఇటువంటి యాప్‌లతో చట్టవిరుద్ధమైన సమావేశాలు, నిరసనలను సమన్వయం చేయడంతో పాటు భద్రతా సంస్థల కంటపడకుండా సైబర్ నేరగాళ్లు, నేరస్థులు అసాయింఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది.

బిట్ చాట్ అంటే ఏమిటి?

బిట్ చాట్.. ఇంటర్నెట్ అవసరం లేకుండా బ్లూటూత్ ద్వారా సమీపంలోని డివైజ్​ల మధ్య సమాచారం షేర్​ చేసుకునే మెసేజింగ్ అప్లికేషన్. ఈ యాప్ పనిచేయడానికి మొబైల్ డేటా, వైఫై , సెల్ టవర్లతో పనిలేదు. స్మార్ట్‌ఫోన్‌లలోని ‘బ్లూటూత్ లో ఎనర్జీ’ సాంకేతికతను ఉపయోగించి సమీపంలోని ఒక ఫోన్ నుండి మరొక ఫోన్‌కు చైన్ రూపంలో మెసేజ్‌లు చేరవేస్తుంది. ఇటీవల లాంచ్ అయిన ఈ యాప్ చాలా మంది యూజర్ల దృష్టిని ఆకర్షించింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>