ఎస్సీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: బీజేపీ దళిత మోర్చా

క‌లం, నిర్మ‌ల్‌: ఎస్సీ (SC) జనాభా దామాషా ప్రకారం రాజకీయాల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా దళిత మోర్చా (BJP Dalit Morcha) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ (Nirmal) కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు సాధు ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగాల్లో అమలులో ఉన్నట్లుగానే ఎస్సీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయాల్లోనూ 15 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.

ఎస్సీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగేలా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, నర్సాపూర్ (జి) మండల అధ్యక్షుడు బర్కుంట నరేందర్, పసుల నవీన్, నాయకులు రమేష్, ఉంగరాల రాజు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>