‘వాంగ్‌చుక్’ మరో అన్నా హజారే.. సీజేపీ, కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) తన నిరసన దీక్ష విరమించిన నేపథ్యంలో సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే(Abhijeet Dipke), కాంగ్రెస్ పార్టీ నేతలు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ పరీక్షల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని లోపాలపై ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ ఉద్యమం కేవలం ఒకరిద్దరిది కాదని, ఇది దేశవ్యాప్త యువత ఆక్రోశమని వారు స్పష్టం చేశారు.

ఈ మేరకు సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. సోనమ్ వాంగ్‌చుక్‌ను బీజేపీ ప్రభుత్వం కిడ్నాప్ చేసిందని సంచలన ఆరోపణ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఉద్యమం సోనమ్ వాంగ్‌చుక్‌ది కాదు, అభిజిత్ దీప్కేది అసలే కాదు అని వ్యాఖ్యానించారు. ఇది ఈ దేశంలో భవిష్యత్తు కోసం పోరాడుతున్న ప్రతి ఒక్క యువకుడికి, విద్యార్థికి సంబంధించిన ఉద్యమం అని తెల్చి చెప్పారు.

ఇది ఏ రాజకీయ ప్రతిపక్షాలు నడిపిస్తున్న ఆందోళన కాదని, కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని బలహీనపరచాలని చూస్తే పొరపాటేనని తెలిపారు. ఒకవేళ ఆరోగ్య కారణాల దృష్ట్యా వాంగ్ చుక్ తన దీక్షను విరమించినప్పటికీ, తమ పోరాటం ఏమాత్రం ఆగదని మరోమారు స్పష్టం చేశారు.

మరోవైపు వాంగ్‌చుక్ నిరసన దీక్ష విరమణపై కాంగ్రెస్ పార్టీ వర్గాలు విమర్శలు గుప్పించాయి. వాంగ్‌చుక్ వైఖరి, ఉద్యమం నడుస్తున్న తీరు చూస్తుంటే ఆయన “మరో అన్నా హజారే” లాగా మారుతున్నారని, ఈ తరహా పరిణామాలు అసలు ప్రజా ఉద్యమాల దిశను మార్చే ప్రమాదం ఉందని అంటున్నాయి. సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) పై సీజేపీ చీఫ్, కాంగ్రెస్ పార్టీ వర్గాలు చేస్తున్న తాజా ఆరోపణలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

Read Also: పెళ్లి ఖర్చు రూ.20 లక్షలా.. నెట్టింట చర్చ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>