‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్ సరసన క్రేజీ హీరోయిన్?

కలం, వెబ్ డెస్క్ : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్నభారీ మైథాలాజికల్ యాక్షన్ డ్రామా ‘గాడ్ ఆఫ్ వార్’ ( God of War ) నుంచి బిగ్ అప్‌డేట్ అందుతోంది. ఈ హై వొల్టేజ్ విజువల్ వండర్‌లో జూనియర్ ఎన్టీఆర్ (NTR) సరసన నటించే ఛాన్స్ బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వాణీకి (Kiara Advani) దక్కినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్లకు కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే బలమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) లోని ఒక కీలకమైన పాత్ర కోసం కియారా అయితేనే పర్‌ఫెక్ట్ అని భావించిన చిత్ర యూనిట్.. ఆమెను సంప్రదించి ఫిక్స్ చేశారని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటివరకు ఎన్టీఆర్, కియారా కలిసి నటించకపోవడంతో, ఒకవేళ ఈ వార్త నిజమైతే బాక్సాఫీస్ వద్ద ఈ ఫ్రెష్ కాంబినేషన్ నెక్ట్స్ లెవల్ క్రేజ్ క్రియేట్ చేయడం ఖాయమని తారక్ ఫ్యాన్స్ అంటున్నారు.

అయితే కియారా అద్వాణీ ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ‘అరవింద సమేత’ వంటి పవర్‌ఫుల్ హిట్ తర్వాత తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

Read Also: ప్రమాదంలో కోట్లాది యువత.. WHO సంచలన రిపోర్ట్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>