కలం, వెబ్ డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దిప్కే (Abhijit Dipke)ను అరెస్ట్ చేశారంటున్న వస్తున్న వార్తలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఆయన్ను తాము అదుపులోకి తీసుకోలేదని.. పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అయితే, సీజేపీ అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ మాత్రం.. దిప్కేను అరెస్ట్ చేశారని.. ఎంపీలు తమకు మద్దతుగా నిలవాలని కోరడం గమనార్హం.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలంటూ గత 23 రోజులుగా సీజేపీ చేస్తున్న ఆందోళనలు సోమవారం తీవ్ర రూపం దాల్చాయి. నిరసనకారులు పార్లమెంట్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
పోలీసులపై రాళ్ల దాడి..
పార్లమెంట్ వైపు నిరసనకారులు వెళ్తున్న క్రమంలో వారిని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాటలు జరిగాయి. బారికేడ్లు అడ్డు పెట్టిన పోలీసులపైకి దూసుకెళ్లారు. ఈ సందర్భంగా ఓ సబ్ ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల దాడి చేశారని సబ్ ఇన్స్పెక్టర్ వెల్లడించడం గమనార్హం.
రణరంగంగా మారిన పార్లమెంట్ పరిసరాలు..
ఆందోళనకారులు దూసుకొస్తుండటం.. వారిపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం, లాఠీఛార్జి చేయడం వంటి ఘటనలతో పార్లమెంట్ పరిసరాలు రణరంగంగా మారాయి. పార్లమెంటులోకి ఎవరూ ప్రవేశించకుండా.. అన్ని రకాల గేట్లును పూర్తిగా మూసివేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా వేలాది మంది పోలీసులను మోహరించారు. ప్రస్తుతానికి పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
Read Also: బరువు తగ్గిస్తానని నమ్మించి.. యువతిపై జిమ్ ట్రైనర్ లైంగికదాడి..!
Follow Us On : WhatsApp

