విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు విద్యాసంస్థలకు సెలవు

కలం, వెబ్​ డెస్క్ : ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో విద్యార్థులకు ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. ఫిఫా ప్రపంచకప్​ ఫైనల్​ ను దృష్టిలో ఉంచుకుని కేరళ, మణిపూర్ రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు రేపు (సోమవారం) సెలవు (School Holiday) ప్రకటిస్తూ ఆయా ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి.

ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లను విద్యార్థులు వీక్షించేందుకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మ్యాచ్ భారత్​ కాలమాన ప్రకారం అర్ధరాత్రి 12.30 గంటలకు ప్రారంభం అవుతుంది. దీంతో తెల్లారి విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతారనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ముఖ్యంగా ఫుట్‌బాల్‌కు విశేష ఆదరణ ఉన్న కేరళ, మణిపూర్ రాష్ట్రాల్లో ఫుట్​ బాల్​ టోర్నమెంట్​ పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం పాఠశాలలు, విద్యాసంస్థలు మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు, ఫుట్‌బాల్ అభిమానులు ప్రపంచ కప్ మ్యాచ్‌లను ఆస్వాదించేలా ఈ సెలవు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>