నిఖత్‌ జరీన్‌కు మోకాలి సర్జరీ.. ఇన్‌స్టాలో పోస్ట్!

క‌లం, వెబ్ డెస్క్‌: భారత స్టార్ బాక్సర్, రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్‌ (Nikhat Zareen) కు మోకాలి శస్త్రచికిత్స జరిగింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తైంది. కొంతకాలంగా మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న నిఖత్.. చివరకు శస్త్రచికిత్స చేయించుకుంది. ప్రస్తుతం కోలుకునే ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన నిఖత్.. గత కొన్ని నెలలు తనకు చాలా కష్టంగా గడిచాయని తెలిపింది.

అయినా తాను మరింత బలంగా తిరిగి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొంది. రికవరీని ఓపిక, విశ్వాసం, పట్టుదలతో కొనసాగిస్తానని చెప్పింది. తనకు చికిత్స అందించిన డాక్టర్ దిన్‌షా పార్దీవాలా, కోకిలాబెన్ ఆస్పత్రి వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే తనకు అండగా నిలిచిన రిలయన్స్ ఫౌండేషన్ స్పోర్ట్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది. ఇది తన ప్రయాణంలో చిన్న విరామం మాత్రమేనని నిఖత్ స్పష్టం చేసింది. మరింత బలంగా త్వరలోనే రింగ్‌లోకి తిరిగి వస్తాననే నమ్మకం వ్యక్తం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>