తానూర్ KGBVకి కొత్త కళ.. అదనపు తరగతి గదులు ప్రారంభం

కలం, నిర్మల్: తానూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)లో నాబార్డ్ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలను ముధోల్ ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్ రామారావు పటేల్ (Pawar Rama Rao Patel) శనివారం ప్రారంభించారు.

రూ. 56 లక్షలతో నిర్మించిన మొదటి అంతస్తులోని అదనపు తరగతి గదులు, రూ.42.12 లక్షలతో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను ప్రారంభించి విద్యార్థినులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాలికలకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంలో ఈ పనులు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Read Also: ఒకే పార్టీ.. రెండు శిబిరాలు.. నిర్మల్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>