కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ 10వ డివిజన్ కార్పొరేటర్ సౌగాని కొమరయ్య ఆధ్వర్యంలో, అపోలో రీచ్ హాస్పిటల్ వారి సహకారంతో కట్టరాంపూర్‌లోని 10వ డివిజన్‌లో ఉచిత వైద్య శిబిరం (Free Health Camp) ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై.. రిబ్బన్ కట్ చేసి క్యాంపును ప్రారంభించారు. అనంతరం స్వయంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకుని వైద్య శిబిరంలోని సౌకర్యాలను పర్యవేక్షించారు.
కార్యక్రమంలో డా. తిరునాధర్ జనరల్ ఫిజీషియన్, డా. సుబ్రత్ కుమార్ సోరెన్ న్యూరో & స్పైన్ సర్జన్ పాల్గొన్నారు. ఈ శిబిరంలో స్థానిక ప్రజలు విశేషంగా పాల్గొని అపోలో వైద్యులు అందించిన ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.
Read Also: ఆ సభలో వాళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులే: మంత్రి అడ్లూరి
Follow Us On : WhatsApp

