‘వార‌ణాసి’ నుంచి బిగ్ స‌ర్‌ప్రైజ్‌ వచ్చేసింది!

కలం, వెబ్ డెస్క్ : దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న పాన్ వరల్డ్ మూవీ ‘వార‌ణాసి’ నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ‘వార‌ణాసి’ చిత్ర యూనిట్ ఆమెకు విషెస్ తెలియజేస్తూ.. మూవీలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra Varanasi) ఫస్ట్ ‌లుక్‌తో పాటు సెట్స్‌లోని ఫొటోను కూడా రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ ఫొటోలో ప్రియాంక పూర్తి నలుపు రంగు దుస్తులలో దుస్తులతో , ఉంగరాల జట్టుతో స్టైలిష్‌గా కనిపించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా ‘మందాకి’ని పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘మందాకి’ని నవ్వితే అందం, నవ్వకపోతే నిప్పు కణిక అంటూ ధర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియాలో సదరు ఫొటోలకు క్యాప్షన్‌ను జోడించారు. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కే.ఎల్. నారాయణ దాదాపు రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం. ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. టైం ట్రావెల కాన్సెప్ట్‌తో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>