నేడు ఘట్‌కేసర్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. అందెశ్రీ స్మృతివనానికి శంకుస్థాపన

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రచయిత, ప్రజాకవి స్వర్గీయ అందెశ్రీ సాహిత్య వారసత్వాన్ని చిరస్థాయిగా నిలిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అడుగువేసింది. నేడు ( జూలై 18) మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లో అందెశ్రీ విగ్రహం, స్మృతివనం నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) అధికారికంగా శంకుస్థాపన చేయనున్నారు.

గత ఏడాది నవంబర్ 10న అందెశ్రీ మరణించిన సమయంలో ఘట్‌కేసర్‌లో జరిగిన అంత్యక్రియల్లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని ఆయన పాడె మోశారు. ఆ రోజే అందెశ్రీ జ్ఞాపకార్థం ఒక అద్భుతమైన స్మృతివనాన్ని, విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, అలాగే ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అందెశ్రీ జయంతిని పురస్కరించుకుని సీఎం ఈ పనులకు భూమిపూజ చేయడం విశేషం. మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అందెశ్రీ సాహిత్యం, పాటలతో ఉన్న ఓ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

కాగా, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, రాష్ట్ర సంస్కృతి, సాహిత్య వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్ సమీపంలో ఉన్న అందెశ్రీ సమాధి వద్ద దాదాపు 1.20 ఎకరాల ఈ స్మృతివనాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 3.95 కోట్ల నుండి రూ. 4 కోట్ల వరకు నిధులను అంచనా వ్యయంగా కేటాయించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>