కాలి న‌డ‌క‌న తిరుమ‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య‌!

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) భార్య అన్నా లెజినోవా (Anna Lezhneva) శుక్ర‌వారం తిరుమ‌ల (Tirumala) శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ముందుగా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న అన్నాకు జ‌న‌సేన నాయ‌కులు ప‌లువురు స్వాగ‌తం ప‌లికారు. ఆమె అక్క‌డి నుంచి కారులో అలిపిరికి బ‌య‌లుదేరి అక్క‌డి నుంచి మెట్ల మార్గంలో కొండ‌పైకి చేరుకున్నారు.

అన్నాతో పాటు పలువురు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కూడా కాలి న‌డ‌క‌న కొండ‌పైకి వ‌చ్చారు. అనంతరం శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆల‌య అర్చ‌కులు ద‌గ్గ‌రుండి అన్నాకు స్వామి వారి ద‌ర్శ‌నం జ‌రిపించారు. అన్నా లెజినోవా మెట్ల మార్గంలో న‌డుస్తూ వెళ్లిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>