మంథనిలో న్యాక్ సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్

కలం, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి జిల్లా మంథనిలో (Manthani) నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ (NAC Skill Centre)  ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్ర భవన నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేస్తూ రవాణా, రోడ్లు, భవనాల (TR&B) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.

నిర్మాణ రంగంలో పెరుగుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించడమే ఈ కేంద్రం లక్ష్యంగా పనిచేయనుంది. నిర్మాణ రంగానికి అవసరమైన అత్యుత్తమ మానవ వనరులను తయారు చేయడంలో ఎన్‌ఏసీ సెంటర్ కీలక పాత్ర పోషించనుంది. ఈ కేంద్రంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సుల ద్వారా శిక్షణ అందించనున్నారు. ఆధునిక నిర్మాణ సాంకేతికతపై శిక్షణ పొందిన యువతకు స్వయం ఉపాధి అవకాశాలతో పాటు ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.

మంథనికి ప్రతిష్టాత్మక ఎన్‌ఏసీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కేటాయించడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర తెలంగాణ యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పించడంలో ఈ కేంద్రం వారధిగా నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>