వింతైన టైటిల్.. క్యూరియాసిటీ పెంచిన ‘పళ్ళబురుసు’

కలం, సినిమా : అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) నిర్మాణంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘పళ్ళబురుసు’ (Pallaburusu) ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. వినోదం, గందరగోళం, ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని చిత్రబృందం తెలిపింది. అసలేంటి ఈ పళ్ళబురుసు? అంటూ ఆసక్తిని రేకెత్తిస్తూ విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన వస్తోంది.

సరదా వినోదంతో కూడిన క్విర్కీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు నటిస్తున్నారు. ‘పళ్ళబురుసు’ (Pallaburusu) చిత్రం 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.

Read Also: జానీ మాస్టర్‌కు ఊహించని షాక్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>