ఇన్నాళ్ల‌కు గుర్తొచ్చామా వాన‌.. నిర్మ‌ల్‌లో 20 రోజుల త‌ర్వాత వ‌ర్షం!

క‌లం, నిర్మ‌ల్‌: ఇన్నాళ్ల‌కు గుర్తొచ్చామా వాన.. ఎన్నాళ్ల‌ని దాక్కుంటావే పైన.. అంటూ నిర్మ‌ల్ (Nirmal) వాసులు వ‌ర్షానికి (Rain) వెల‌క‌మ్ చెప్తున్నారు. నిర్మల్‌లో గత ఇరవై రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు గురువారం ఒక్కసారిగా కరుణించి జిల్లా కేంద్రంలో ప్ర‌జ‌ల్ని ప‌ల‌క‌రించాడు. మధ్యాహ్నం కురిసిన వర్షంతో పట్టణమంతా చల్లబడింది. ఎండ వేడితో అల్లాడిపోయిన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో జిల్లాలో వేసవిని తలపించేలా ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులు కూడా వర్షాల కోసం ఎదురు చూశారు. గురువారం కురిసిన భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారి చల్లదనాన్ని సంతరించుకుంది. కొంత మేర కార్య‌క‌లాపాల‌కు ఆటంకం వాటిల్లినా వర్షాన్ని ప్రజలు ఆనందంగా స్వాగతించారు. ఈ వర్షంతో జిల్లాలో ఖరీఫ్ సాగుపై ఆశలు మళ్లీ చిగురించాయని రైతులు చెప్తున్నారు. కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించడంతో పాటు, ప్రకృతికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

Read Also: నిర్మల్ కాంగ్రెస్‌లో రాజుకున్న అంతర్గత పోరు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>