బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలి: ఎస్పీ జానకి

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ జిల్లా సీసీ కుంట పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ డి. జానకి (Mahabubnagar SP) గురువారం ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో నమోదైన పెండింగ్ కేసుల పురోగతి, దర్యాప్తు స్థితి, గ్రేవ్ కేసుల విచారణ, వారెంట్ల అమలు, పెండింగ్ పిటిషన్లు, కోర్టు ట్రయల్‌లో ఉన్న కేసులు, రికార్డుల నిర్వహణ అంశాలను సమీక్షించారు. ప్రతి కేసును వేగవంతంగా దర్యాప్తు చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని సూచించారు.

నేరాల నియంత్రణకు బీట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. గ్రామాలవారీగా అనుమానాస్పద వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఆర్థిక మోసాల బారిన పడకుండా గ్రామస్థులను అప్రమత్తం చేయాలని సూచించారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి సత్వర సేవలు అందించాలన్నారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణను కూడా పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి నేరస్థులకు శిక్ష పడేలా పటిష్టమైన సాక్ష్యాధారాలతో ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ఎస్పీ తనిఖీలో సీసీ కుంట ఎస్‌ఐ కృష్ణ ఓబుల్ రెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Read Also: తెలంగాణలో తీవ్రంగా కరెంట్ కోతలు: హరీశ్ రావు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>