కొడుకు డ్రగ్స్ వ్యవహారంపై స్పందించిన ఎమ్మెల్సీ!

కలం, వెబ్ డెస్క్ : తమ కుమారుడు భరత్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నాడంటూ, అతడిని మంగళ్‌హాట్ పోలీసులు అరెస్ట్ చేశారంటూ సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి (MLC Venkatrami Reddy) స్పష్టం చేశారు. ఈ రకమైన అసత్య ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు.

ఈ రోజు ఉదయం మంగళ్‌హాట్ పోలీసులు తమ నివాసానికి వచ్చి విచారణ జరిపిన మాట వాస్తవమేనని ఆయన తెలిపారు. అయితే, ఒక కామన్ ఫ్రెండ్ ఫోన్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న నంబర్ల ఆధారంగానే పోలీసులు ఈ విచారణకు వచ్చారని ఆయన వివరించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో తన కుమారుడు భరత్ రెడ్డి ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని తేలిపోయిందని వెంకట్రాంరెడ్డి పేర్కొన్నారు. భరత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయలేదని, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారమంతా పూర్తిగా నిరాధారమని ఆయన స్పష్టం చేశారు.

Read Also: బిగ్ అప్డేట్ : జమిలి ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>