నకిరేకల్‌ను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే వేముల వీరేశం

కలం, నకిరేకల్ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) తెలిపారు. నకిరేకల్ (Nakrekal) పట్టణంలో పద్మశాలి సంఘం సభ్యుల కోసం రూ. 30 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ భవనం, డైనింగ్ హాల్ నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) మాట్లాడుతూ.. సమాజంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పద్మశాలి సంఘం సభ్యులు తమ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను, శుభకార్యాలను నిర్వహించుకోవడానికి ఈ నూతన కమ్యూనిటీ భవనం, డైనింగ్ హాల్ ఎంతో ఉపయోగకరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.

నియోజకవర్గ ప్రజలకు అవసరమైన అన్ని రకాల అభివృద్ధి పనులను దశలవారీగా గుర్తిస్తూ, వాటిని వేగంగా పూర్తి చేస్తామని అన్నారు. నకిరేకల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడమే మా లక్ష్యమని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక వసతుల కల్పనకు మరింత కృషి చేస్తామని తెలిపారు.

Read Also: లీకేజీలు, వైరింగ్ లోపాలను ముందే కనిపెట్టే సరికొత్త గ్యాడ్జెట్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>