బస్టాండ్ ప్రయాణికులకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తా: ఎమ్మెల్యే

కలం, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ (MLA Raj Thakur) శనివారం స్థానిక గోదావరిఖని బస్టాండ్‌ (Godavarikhani Bus Stand)లో చేపట్టనున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌ను ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. బస్టాండ్‌లో ఆధునిక ప్లాట్‌ఫారమ్‌లు, ప్రత్యేక ఆటో స్టాండ్, ఆటో డ్రైవర్లకు అవసరమైన సౌకర్యాలు, ఫుట్‌పాత్‌లు, తాగునీరు, పరిశుభ్రతతో పాటు ప్రయాణికులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాలని ఆదేశించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్టాండ్‌ను అభివృద్ధి చేసి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే  (MLA Raj Thakur) కోరారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, సింగరేణి జనరల్ మేనేజర్, సంబంధిత శాఖల అధికారులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: రాష్ట్రంలో ఇదే పెద్ద సమస్య: సీఎం రేవంత్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>