మొటిమలు, బ్లాక్ హెడ్స్‌తో విసిగిపోయారా? జామ ఆకులతో ఇలా చేయండి!

కలం, వెబ్‌డెస్క్: అమ్మాయిలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యలలో ముఖ్యమైనవి మొటిమలు, బ్లాక్ హెడ్స్. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు అమ్మాయిలు రకరకాలు క్రీములు, ఫేస్ ప్యాక్‌లు వాడుతుంటారు. అయితే జామ ఆకులతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా? అవును జామ ఆకులు కూడా చర్మ సౌందర్యానికి (Skin Care Tips) ఉపయోగపడతాయని సూచిస్తున్నారు నిపుణులు.

మొటిమల నివారణకు

మొటిమల సమస్యతో బాధపడేవారికి జామ ఆకు చక్కటి పరిష్కారం చూపుతుందని సూచిస్తున్నారు నిపుణులు. కొన్ని తాజా జామ ఆకులను తీసుకుని, వాటిని శుభ్రంగా కడిగి, కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్‌లా నూరుకోవాలి. ఈ పేస్ట్‌ని మొటిమల ఉన్న చోట అప్లై చేయాలి. జామ ఆకులో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నశింపజేస్తాయని సూచిస్తున్నారు నిపుణులు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన చక్కటి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

బ్లాక్ హెడ్స్ పోవాలంటే

జామాకు, కలబందతో బ్లాక్ హెడ్స్ సమస్యను నివారించచ్చని చెబుతున్నారు నిపుణులు. దీనికోసం ఒక టేబుల్ స్పూన్ జామాకు పేస్ట్‌ను తీసుకోవాలి. దానికి అంతే మొత్తంలో కలబంద గుజ్జు, చిటికెడు పసుపుని కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పైన రాయాలట. అలా 20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు.

అయితే ఇది సహజసిద్ధమైన చిట్కానే అయినా ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకుని ఎలాంటి సమస్యలూ లేవని నిర్ధారించుకున్న తర్వాతే దీనిని వాడడం మంచిది అంటున్నారు నిపుణులు. అలాగే వాడే ముందు జామాకులను దుమ్ము లేకుండా చక్కగా శుభ్రం చేయాలి అని సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>