ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక.. మార్చి 6 నుంచి 99 రోజుల యాక్షన్ ప్లాన్

కలం, వెబ్ డెస్క్: మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరగనుంది. మొత్తం ఐదు దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ (99 Day Action Plan) అమలుకాబోతోంది. ప్రణాళిక శాఖ ఈ కార్యక్రమానికి నోడల్ శాఖగా వ్యవహరిస్తుంది. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల, మే 2న నియోజకవర్గ, మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమాలు ఉండనున్నాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక ఉండనుంది.

మార్చి 6న అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల (Ministers) ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. 99 రోజుల్లో శాఖల వారీగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలుంటాయి. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఉన్నతాధికారులు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు.

10 వివిధ థీమ్ లతో 99 రోజుల కార్యక్రమం

1. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత. ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్
2. ఆరోగ్యం
3. అరైవ్.. అలైవ్
4. సంక్షేమం
5. పిల్లల భద్రత.. డ్రగ్స్ కు అడ్డుకట్ట
6. రైతు సంక్షేమం.. వ్యవసాయం
7. విద్య
8. యువత.. క్రీడలు
9. మహిళలు
10. పర్యావరణం

Read Also: HCAలో రూ.70 కోట్ల అవినీతి.. క్రికెట్ సంఘాల ధర్నా

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>