కలం, వెబ్డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Elections) నామినేషన్ ప్రక్రియ రణరంగాన్ని తలపిస్తోంది. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం పుంగనూరు, రాయచోటిలో జరిగిన ఉద్రిక్తతలు మరువకముందే నేడు కడప, పులివెందులలో రాళ్లదాడి జరిగింది. వైసీపీ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు వైసీపీ సీనియర్ నాయకులు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆఫీస్కు తరలివెళ్లారు. పులివెందుల, కడప ఘటనలపై ఎస్ఈసీకి ఫిర్యాదుకు చేయనున్నారు.

