మైలార్‌గూడెంలో పోలీసుల అవగాహన సదస్సు

కలం, యాదగిరిగుట్ట: మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కలిగి ఉండాలని పోలీసులు సూచించారు. గురువారం యాదగిరిగుట్ట (Yadagirigutta) మండలంలోని మైలార్‌గూడెం గ్రామంలో మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వేధింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

సోషల్ మీడియా వినియోగంలో వ్యక్తిగత వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని తెలిపారు. చిన్నారులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలని, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండేలా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు యాదయ్య, ప్రసాద్, పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>