విజయవాడ హైవేపై దసరా రద్దీ: భారీగా నిలిచిన వాహనాలు

కలం, వెబ్ డెస్క్​ : దసరా పండుగ వేళ హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (Hyderabad – Vijayawada Highway)పై ప్రయాణికుల సందడి గణనీయంగా పెరిగింది. పండుగ సెలవులను తమ సొంత ఊళ్లలో జరుపుకొనేందుకు భాగ్యనగర వాసులు పెద్ద ఎత్తున వాహనాల్లో బయలుదేరారు. దీంతో రహదారి పొడవునా రద్దీ నెలకొంది.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం నుండి వలిగొండ క్రాస్ రోడ్ వరకు వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. దీనికి తోడు చౌటుప్పల్ వద్ద ప్రస్తుతం ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు జరుగుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ జామ్‌ను అదుపు చేసేందుకు స్థానిక పోలీసులు రంగంలోకి దిగి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.

Also Read : కరెంట్​ ఆల్​టైమ్​ రికార్డ్.. డిమాండ్ మరింత అధికం!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>