కలం, చంద్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ (Chandrugonda) పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా డి. విజయకుమారి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై విజయకుమారి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
మహిళల భద్రత, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రజల సహకారంతో చంద్రుగొండ మండలంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

