‘శెట్టిపాలెం’లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

కలం, మిర్యాలగూడ : వేములపల్లి (Vemulapally) మండలం శెట్టిపాలెం గ్రామం వద్ద ప్రవహిస్తున్న కాలువలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకురావడం స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. కాలువ నీటిలో శవం తేలుతూ కొట్టుకుపోతుండటాన్ని గమనించిన గ్రామస్థులు, ప్రయాణికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతదేహాన్ని చూసిన పలువురు స్థానికులు తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలను రికార్డు చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే వేములపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

కాలువలో తేలుతున్న మృతదేహాన్ని బయటకు తీసేందుకు స్థానికుల సహాయంతో చర్యలు చేపట్టారు. శవాన్ని వెలికితీసిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతి చెందిన వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాడు? అన్న వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చుట్టుపక్కల మండలాల్లో నమోదు అయిన మిస్సింగ్ కేసుల వివరాలను సేకరిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు కాలువలో పడి జరిగిన మరణమా? లేక ఎవరైనా హత్య చేసి కాలువలో పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>