సీఎం రేవంత్ రెడ్డితో యూకే మేయర్ల బృందం భేటీ

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో యూకే మేయర్ల బృందం సమావేశమైంది. ఈ మీటింగ్‌కు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. రాష్ట్రంలో యూకే పెట్టుబడులకు అవకాశాలు, యూకే-తెలంగాణ వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం దిశగా కార్యాచరణపై చర్చించారు. వైద్యం, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, ఏరోస్పేస్, టెక్నికల్ టెక్స్‌టైల్స్, నైపుణ్యాలు, పరిశోధన, తయారీ రంగాలలో పరస్పర సహకారంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ మీటింగ్‌కు యూకే-ఇండియా బిజినెస్ కౌన్సిల్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ ప్రతినిధులు, సీఎస్ సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణా రావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>