పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం.. ముగ్గురికి రిమాండ్!

కలం, ఖమ్మం బ్యూరో: ​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లెందు (Yellandu) పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకొని ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రోడ్డుపై బైఠాయించి ప్రజా రాకపోకలకు అంతరాయం కలిగించి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. ఈ ఘటన పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండి వెంకటేశ్వర్లు, మద్దెల గోపి, బండి రాజయ్య అనే ముగ్గురు వ్యక్తులు ఇల్లెందు పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. అంతేకాకుండా రోడ్డుపై అడ్డంగా నిలబడి ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించడంతో పాటు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి ఆటంకం కలిగించారు.

​ఈ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం వారిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, కోర్టు వారికి రిమాండ్ విధించింది. వివాదాలు తలెత్తినప్పుడు ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, చట్టబద్ధమైన మార్గాల్లోనే పరిష్కరించుకోవాలని ఇల్లందు పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>