‘సర్’ క్లెయిమ్స్ వెరిఫికేషన్ వెరీ స్లో!

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సర్ ప్రక్రియలో క్లెయిమ్స్ (Voter List Claims), అభ్యంతరాల పరిశీలన నత్తనడకన సాగుతున్నది. భారీ సంఖ్యలో నోటీసులు జారీ చేసినప్పటికీ, వాటిలో మూడో వంతు మాత్రమే ఓటర్లకు అందజేశారు. విచారణ పూర్తయిన నోటీసుల సంఖ్య 1.94 లక్షలకే పరిమితం కావటం గమనార్హం. ఆగస్టు17న ముసాయిదా ఓటర్ల జాబితాలను సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల (ERO) కార్యాలయాల్లో, సీఈఓ అధికారిక వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచారు. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ అండ్ డుప్లికేట్ (ASDD) ఓటర్ల జాబితాను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

92.88 లక్షల నోటీసులు.. 31.74 లక్షలే డెలివరీ

క్లెయిమ్స్ (Voter List Claims), అభ్యంతరాలు స్వీకరించే గడువు సెప్టెంబర్ 16 వరకు ఉంది. నోటీసుల జారీ, క్లెయిమ్స్ అభ్యంతరాల (Voter List Claims) పరిష్కారానికి అక్టోబర్ 15 వరకు అవకాశం ఉంది. ప్రస్తుతం 92,88,112 నోటీసులు జారీ అయ్యాయి. మరో ఏడు నోటీసులు మాత్రమే జారీ కావాల్సి ఉంది. అయితే వీటిలో ఇప్పటివరకు 31,74,952 నోటీసులను మాత్రమే ఓటర్లకు అందజేయడం గమనార్హం. అందిన నోటీసుల్లో 1,94,737 నోటీసులపై మాత్రమే ఈఈఆర్ ఓ స్థాయిలో విచారణలు పూర్తయ్యాయి. మిగిలిన నోటీసులను దశలవారీగా ఓటర్లకు అందజేసి, విచారణ చేపడతామని అధికారులు తెలిపారు.

9.07 లక్షల క్లెయిమ్స్, అభ్యంతరాలు

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 9,07,292 క్లెయిమ్స్, అభ్యంతరాలు అందాయని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. కొత్త ఓటర్ల నమోదుకు 3,94,517 మంది, విదేశాల్లో నివసించే భారతీయ ఓటర్ల నమోదుకు సంబంధించి 6,346 దరఖాస్తులు వచ్చాయి. అభ్యంతరాలు, తొలగింపుల కోసం 48,752, ఓటర్ల జాబితాలో సవరణల కోసం 4,57,677 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాల దాఖలుకు సెప్టెంబర్ 5, 6 ,12, 13న పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచారం

తొలి విడత: సెప్టెంబర్‌ 5, 6
రెండో విడత: సెప్టెంబర్‌ 12, 13

ముఖ్యమైన తేదీలు
క్లెయిమ్స్‌, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్‌ 15 వరకు గడువు
క్లెయిమ్స్‌, అభ్యంతరాల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్‌ 16
తుది ఓటర్ల జాబితా ప్రచురణకు అక్టోబర్‌ 19వరకు గడువు

Also Read : జీతాలకు సై.. బాధ్యతలకు నై!

Also Read : క్లైమాక్స్‌కు కొండా సురేఖ ఎపిసోడ్?.. నేడే కీలక నిర్ణయం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>