జనాభా గణనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి.. భారతి హోళీకేరి

క‌లం, మెద‌క్ బ్యూరో: జనాభా గణనలో స్వీయ గణన ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని రాష్ట్ర సెన్సస్ (Telangana Census) ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళీ కేరి అన్నారు. కుటుంబంలోని సభ్యులందరి వివరాలను సంబంధిత యాప్‌లో ముందుగానే నమోదు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమయాన్ని ఆదా చేయడంతోపాటు కచ్చితమైన, నాణ్యమైన సమాచారాన్ని సేకరించాలని తెలంగాణ సూచించారు.

సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఛార్జ్ క్లర్కులు, సాంకేతిక సహాయకులకు జనాభా గణన రెండో దశపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనాభా గణన నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. జనాభా గణన మొదటి దశలో గృహాల జాబితా తయారీ, గృహాల వివరాలు, కుటుంబ సభ్యుల సంఖ్యకు సంబంధించిన సమాచారాన్ని సేకరించినట్లు తెలిపారు. రెండో దశలో ప్రతి వ్యక్తికి సంబంధించిన వివరాలను నిబంధనల ప్రకారం కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

స్వీయ గణన పూర్తయిన అనంతరం ఎన్యూమరేటర్లు సంబంధిత కుటుంబాలను సందర్శించి, నమోదు చేసిన వివరాలను పరిశీలించాలన్నారు. అవసరమైన చోట సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ విధానం ద్వారా ఎన్యూమరేటర్ల పని భారం తగ్గడంతోపాటు, ప్రజల సమయం కూడా ఆదా అవుతుందని వివరించారు. జిల్లా జనాభాను దృష్టిలో ఉంచుకొని నిర్ణీత సమయంలో స్వీయ గణన లక్ష్యాలను సాధించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. గతంలో నిర్వహించిన హౌస్‌లిస్టింగ్ ఆపరేషన్ లో సేకరించిన వివరాలను ఆధారంగా క్షేత్రస్థాయి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి, వివరాల కచ్చితత్వం ఉండాల‌ని ఆమె సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>