కలం, మహబూబ్ నగర్ బ్యూరో: సమాజంలో పరస్పర గౌరవాన్ని పెంపొందించేందుకు ఆత్మీయ సమ్మేళనాలు ఎంతో ఉపయోగపడతాయని బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అయ్యప్ప స్వామి భక్తి, ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, సేవాభావం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతాయని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కులమతాలకు అతీతంగా ఐకమత్యం, సోదరభావం, పరస్పర గౌరవాన్ని పెంపొందించడంలో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు రాజకీయాల కతీతంగా వ్యక్తిగత విమర్శలకు దూరంగా అయ్యప్ప స్వామి భక్తులు అందరూ సోదర భావంతో మెలుగుతారని ఇది మన సంస్కృతి గొప్పతనం అని ఆయన కొనియాడారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

