కలం, సోన్: విజయదశమి పండుగను పురస్కరించుకొని సోన్ (Soan Police Station) మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో మంగళవారం ఆయుధపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై గోపి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పోలీసు శాఖలో విధుల నిర్వహణకు వినియోగించే ఆయుధాలకు పూజలు చేశారు.
విజయదశమి పర్వదినాన ఆయుధపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. పోలీసులు ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నింపాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

