బ్యాంక్ కస్టమర్లకు SBI కీలక సూచనలు

కలం, వెబ్ డెస్క్: బ్యాంక్ కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక సూచనలు జారీ చేసింది. ఇటీవల 3,987 మంది కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు చోరీ చేసి, డార్క్ వెబ్‌లో పెట్టారు. ఇది దేశ వ్యాప్తంగా కలకలం రేపడంతో వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఎవరి డేటా గల్లంతు అయిందో ఈ–మెయిల్స్, వాట్సాప్ ద్వారా సమాచారం అందించినట్లు పేర్కొంది. అయితే అకౌంట్లలో డబ్బులు మాత్రం సురక్షితంగా ఉన్నాయని.. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

మరింత అప్రమత్తంగా..

కస్టమర్లు ఇక నుంచి బ్యాంక్ అకౌంట్ లాగిన్లపై అప్రమత్తంగా ఉండాలని SBI హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు, పిన్, పాస్ వర్డులు బ్యాంకుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని సూచించింది. అలాగే అనుమానాస్పద కాల్స్, మెస్సేజ్‌లు, ఈ మెయిల్స్‌కు స్పందించవద్దని కోరింది. బ్యాంక్ కస్టమర్ల భద్రత కోసం నిరంతరం చర్యలు చేపడుతున్నట్లు వివరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>