కలం, మెదక్, బ్యూరో: ఎస్ఐ, కానిస్టేబుల్ పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు క్రమశిక్షణతో చదవాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి ఎస్పీ (Sangareddy SP) పరితోశ్ పంకజ్ దిశానిర్దేశం చేశారు. జోగిపేటలోని నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కళాశాలలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ఉచిత కోచింగ్ తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. నిరంతర సాధనతో లక్ష్యాన్ని చేరుకోవచ్చనన్నారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలని అభ్యర్థులకు సూచించారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్., జోగిపేట సీఐ అనిల్ కుమార్ పాల్గొన్నారు.
Also Read : 2028 ఒలింపిక్స్లో మరిన్ని పతకాలు సాధిస్తాం: మోదీ
Follow Us On: Youtube

