చండూరులో వైభవంగా రాచకొండ బతుకమ్మ సంబరాలు

కలం, మునుగోడు : చండూరు పట్టణంలో రాచకొండ బతుకమ్మ (Rachakonda Bathukamma ) సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను మహిళలు, ప్రజలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఎల్‌వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరుగ దిండ్ల భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని, మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేలా ఇలాంటి వేడుకలను ఘనంగా నిర్వహించాలని అన్నారు.

మునుగోడు ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పాలకులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. ముఖ్యంగా క్లోరోసిస్ నిర్మూలన కోసం చేపట్టిన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించి, శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అలాగే, మునుగోడు ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగునీటి అవసరాలు తీర్చడంలో కీలకమైన శివన్నగూడెం రిజర్వాయర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని భాస్కర్ కోరారు. ప్రాజెక్టు పనుల్లో జాప్యం వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడకూడదని, ప్రభుత్వం పనుల పురోగతిని సమీక్షించి నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మునుగోడు ప్రాంతంలో సాగునీటి సదుపాయాల అభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వాటి పరిష్కారం కోసం ప్రజల పక్షాన తమ కృషి కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌండేషన్ సభ్యులు, ప్రజలు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>