ఆలయంలో కాల్పులకు కుట్ర.. అమెరికాలో కలకలం!

కలం, వెబ్ డెస్క్: అమెరికాలోని హిందూ ఆలయంలో (America Temple) కాల్పుల కుట్రకు తెగబడటం కలకలం రేపింది. ఇల్లినోస్ రాష్ట్రంలోని అరోరా సిటీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాల్పుల కుట్రను పోలీసులు ఛేదించి.. 19 ఏళ్ల అలెగ్జాండ్రోస్ పాపొరకిస్‌ను అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఏఆర్ రైఫిల్, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. భారతీయులతో పాటు దక్షిణాసియాకు చెందిన వారిని లక్ష్యంగా ఆలయంలోకి చొరబడి కాల్పులు ప్రారంభించాలని గత రెండేళ్లుగా నిందితుడు ప్రయత్నిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఒక ప్రైవేట్ సంస్థలో క్యాషియర్‌గా పని చేస్తున్న అలెగ్జాండ్రోస్.. తీవ్రమైన జాత్యాహంకార భావాలున్న వ్యక్తిగా గుర్తించారు.

భారతీయులంటే ద్వేషం..

భారతీయులను ఉద్దేశించి అలెగ్జాండ్రోస్ తరచూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తుంటాడని అతడి తోటి ఉద్యోగులు చెప్పారు. అంతేగాకుండా నాజీ భావజాలం, సాయుధ పోరాటాలను తాను గట్టిగా సమర్థిస్తానిని పలుమార్లు తమతో వాదించేవాడని పోలీసుల విచారణలో వివరించారు. హిందూ దేవాలయంపైనే దాడికి దిగేందుకు యత్నించడంతో అక్కడున్న భారతీయులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ ఘటనతో అమెరికాలో భారతీయుల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>