వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్!

కలం, స్పోర్ట్స్​ : భారత్‌లో జరగనున్న ఓవర్‌-50 క్రికెట్ ప్రపంచకప్‌ (World Cup)లో పాకిస్థాన్ జట్టు పాల్గొనడం లేదు. భారత్‌లో ఆడేందుకు తమ ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని పాకిస్థాన్ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ అధిపతి ఫవాద్ ఇజాజ్ వెల్లడించారు. దీంతో టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. తమ స్థానంలో మరో జట్టును ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ముందుగా ఆసక్తి చూపింది. ఆటగాళ్లకు వీసాలు, ఉన్నతస్థాయి భద్రత కల్పిస్తామని నిర్వాహకులు, ఆతిథ్య దేశం హామీ ఇచ్చాయి. దీంతో పాక్ క్రికెట్ బోర్డు, విదేశాంగ శాఖ, అంతర్గత వ్యవహారాల శాఖ అనుమతుల కోసం పీవీసీఏ ప్రయత్నించింది.

అనుమతి లేదు

పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి, ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తమ జట్టుకు భారత్‌లో ఆడేందుకు అనుమతి లేదని తెలిపినట్లు ఫవాద్ ఇజాజ్ పేర్కొన్నారు. దీంతో టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు నిర్వాహకులకు తెలియజేశారు. ఇటీవల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత్‌కు రావడానికి పాకిస్థాన్ హాకీ సమాఖ్య కూడా నిరాకరించింది. దీంతో పాక్ స్థానంలో బంగ్లాదేశ్‌కు అవకాశం కల్పించారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త సంబంధాల కారణంగా ఇరు దేశాల జట్లు బహుళ దేశాల టోర్నీల్లో, తటస్థ వేదికలపైనే సాధారణంగా తలపడుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>