కలం, నిర్మల్: దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు దొడ్డికింది ముత్యం రెడ్డి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా (BJP Kisan Morcha) రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో బీజేపీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ముత్యం రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించా. కిసాన్ మోర్చా ద్వారా రైతుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాథోడ్, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, గుండంపల్లి గ్రామ సర్పంచ్ తక్కల రమణారెడ్డి, నాయకుడు జమాల్ తదితరులు పాల్గొన్నారు.

