కలం, భైంసా: భైంసా పట్టణంలోని పశువుల సంత (Bhainsa Cattle Market) లో రూ.31 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Rama Rao Patel) గురువారం భూమిపూజ చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ ఆధ్వర్యంలోని పాలకవర్గం పదవీకాలం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతులకు అందించిన సేవలను, మార్కెట్ కమిటీ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. రైతుల సంక్షేమం కోసం చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ చేసిన సేవలను అభినందించారు. అనంతరం చైర్మన్‌ను ఘనంగా సన్మానించారు. పాలకవర్గం పదవీకాలం ముగింపు సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అధికారులను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

