కలం, ముథోల్ : క్రీడలు మానసిక, శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐకమత్యం, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) అన్నారు. ముథోల్ మండల కేంద్రంలో నిర్వహించిన ఫ్రెండ్షిప్ క్రికెట్ టోర్నమెంట్(Cricket Tournament) బహుమతుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు కులమతాలకు అతీతంగా స్నేహం, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముథోల్ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల, ZPHS పాఠశాల వద్ద మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఇటీవల సంబంధిత మంత్రితో చర్చించానని, త్వరలోనే స్టేడియం ఏర్పాటుకు మంజూరు లభించే అవకాశం ఉందని వెల్లడించారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

