కలం, సారంగాపూర్ : సారంగాపూర్ మండలం ఆలూర్ నుంచి ధని గ్రామం వరకు రూ.3.60 కోట్ల సీఆర్ఆర్ నిధులతో చేపట్టనున్న నూతన రహదారి నిర్మాణ పనులకు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఆలూర్, ధని గ్రామాలతో పాటు ఆయా ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మెరుగైన రహదారులు కీలకమని ఎమ్మెల్యే (Maheshwar Reddy) అన్నారు. ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంలో ఆలూర్ – ధని రహదారి ఉపయోగపడనుందని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలూర్, ధని గ్రామల సర్పంచ్ లు ఇర్ల చిన్నయ్య, బడి పోతన్న, బీజేపీ మండల అధ్యక్షుడు కాల్వ నరేష్, నాయకులు ఇర్ల విజయ్, తదితరులు పాల్గొన్నారు.

