శాతవాహన యూనివర్సిటీలో 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతి

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) హర్షం వ్యక్తం చేశారు.

తొలి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏడు విశ్వవిద్యాలయాల్లో మొత్తం 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయనుండగా, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో 49 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చిందని మంత్రి తెలిపారు. ఈ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో నంబర్లు 141, 142లను విడుదల చేసిందని, కామన్ గైడ్‌లైన్స్ మరియు రోస్టర్ విధానానికి అనుగుణంగా ఈ నెలాఖరు నాటికి నోటిఫికేషన్లు వెలువడనున్నాయని పేర్కొన్నారు.

శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల్లో ఖాళీల వివరాలు:

* యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (హుస్నాబాద్):
* కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (CSE): 07
* CSE – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: 07
* ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ECE): 07
* ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT): 05
* ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE): 01
* మెకానికల్ ఇంజినీరింగ్: 02
* ఇంగ్లీష్: 01
* మ్యాథమెటిక్స్: 02
* ఫిజిక్స్: 02
* కెమిస్ట్రీ: 02
* ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్: 01
* లైబ్రేరియన్: 01
* యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా (యూనివర్సిటీ క్యాంపస్):
* లా (న్యాయశాస్త్రం): 08
* యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ (ఎల్‌ఎండీ క్యాంపస్):
* ఫార్మసీ: 02
* యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (యూనివర్సిటీ క్యాంపస్):
* కామర్స్: 01

ఈ పోస్టుల భర్తీ ద్వారా ఉన్నత విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు నాణ్యమైన విద్యాబోధన అందుబాటులోకి వస్తుందని మంత్రి వివరించారు. అర్హత గల నిరుద్యోగ యువత ఈ నియామక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>