క‌లాం ఆశ‌యాలు యువ‌త‌కు ఆద‌ర్శం: అంగంపల్లి సంజీవ్

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని యువకులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని డీసీసీ అధ్యక్షులు అంగంప‌ల్లి సంజీవ్ ముదిరాజ్ (Angampally Sanjeev Mudiraj) పిలుపునిచ్చారు. గురువారం మహబూబ్‌నగర్ పట్టణంలోని న్యూ టౌన్ చౌరస్తాలో భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న పురస్కార గ్రహీత, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో కలాం చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ.. కలాం దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి అని, తన అసాధారణ ప్రతిభ, క్రమశిక్షణ, నిరాడంబర జీవనం, దేశభక్తితో కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. శాస్త్రవేత్తగా దేశ రక్షణ, అంతరిక్ష పరిశోధన రంగాల్లో విశేష సేవలందించి, భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాల సరసన నిలిపేందుకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, రాములు యాదవ్, ఎం.ఏ. కలీమ్, టౌన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ, కార్పొరేటర్లు ఎంపీ ప్రవీణ్ కుమార్, ఫయాజ్, తాహెర్, గులాం జహీర్, జిల్లా మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు గోనెల శ్రీనివాస్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆవేజ్, కాంగ్రెస్ నాయకులు గంజి అంజనేయులు, పీర్ మహమ్మద్ సాదిక్, రియాజుద్దీన్, బాసిత్, అడ్డాని హరినాథ్, గోపాల్ యాదవ్, అబ్రార్ హుస్సేన్, అజ్మత్, ఆశు, బిలాల్, మొహిజ్, ఉషారాణి, సహజ, నజీహా, దామోదర్ రెడ్డి, బూరెమోని చందు యాదవ్, నసీరుద్దీన్, రాజగోపాల్ గౌడ్, ఆలీం, చావ్ హుస్సేన్, ముస్తాక్ అలీ, నియాజ్, సేవాదళ్ నాయకులు జగదీష్, వెంకట్ లక్ష్మి, అలీ భాయ్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు ఇమాద్ బాగ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>