సాగునీరు అందించేందుకు కృషి చేస్తా: శ్రీహరి రావు

కలం, సోన్ : వరి పంటకు సరస్వతి కాలువ ద్వారా మరో తడి సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని నిర్మల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు (Srihari Rao) అన్నారు. సరస్వతి కాలువ ద్వారా సాగునీటి విడుదల నిలిచిపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామ రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వరి పంట పొట్ట దశలో ఉందని మరో తడి నీరు అందకపోతే చేతికొచ్చే పంట ఎండిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.

స్పందించిన శ్రీహరి రావు (Srihari Rao) రైతుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.  శ్రీరామ్ సాగర్ జలాశయం నుండి సరస్వతి కాలువ ద్వారా మరో తడికి నీటిని విడుదల చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు రైతులు పేర్కొన్నారు. ఇందులో రైతులు గడ్డం స్వామి, పెద్ద లక్ష్మన్న, చింతకింది గంగాధర్, పీఏసీఎస్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, నర్సారెడ్డి తదితరులున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>