మ‌హిళ‌తో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. పోలీస్ అరెస్ట్!

క‌లం, వెబ్‌డెస్క్‌: కోల్‌కతా (Kolkata) లోని సురుచి సంఘా పూజా పండల్ వద్ద విధుల్లో ఉన్న సమయంలో ఓ తాత్కాలిక మహిళా హోంగార్డ్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కోల్‌కతా ఆర్మ్‌డ్ పోలీస్ (Police) ఏఎస్‌ఐని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఈ చ‌ర్య‌లు తీసుకున్నారు.

సదరు పోలీస్ అధికారిక హోదాను దుర్వినియోగం చేసినందుకు ఆయనపై శాఖాపరమైన చర్యలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే సమయంలో విధుల్లో ఉండాల్సిన రక్షకభటుడే ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్పడటం స్థానికంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వేడుక‌ల‌కు వ‌చ్చే మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన వ్య‌క్తే నీచంగా ప్ర‌వ‌ర్తించ‌డం ఏమిట‌ని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>